News April 11, 2024

మెదక్‌ MP స్థానంపై మైనంపల్లి ఫోకస్!

image

మెదక్‌ MP స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మైనంపల్లి హన్మంతరావు, MLA రోహిత్‌ కీలక నేతలను హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బుధవారం BRS కౌన్సిలర్లు రోహిత్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రామాయంపేటలోని నలుగురు కౌన్సిలర్లు‌ కాంగ్రెస్‌లో చేరగా.. తూప్రాన్‌ మున్సిపాలిటీలోనూ హస్తం పాగా వేసింది. లోక్‌సభ అంతటా పార్టీ బలోపేతం కోసం మైనంపల్లి‌ ప్రత్యేక చొవర తీసుకొంటున్నట్లు టాక్.

Similar News

News October 26, 2025

మెదక్: ‘పది రోజుల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

image

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌పై కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సమీక్షించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఆయన తహశీల్దార్లు, ఆర్డీఓలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల తర్వాత దరఖాస్తులను తప్పకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.

News October 26, 2025

రామాయంపేట: GREAT.. 56వ సారి రక్తదానం

image

రామాయంపేట పట్టణానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56వ సారి రక్తదానం చేశారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 56వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఎస్పీ అభినందించారు.

News October 26, 2025

అమర వీరుల త్యాగాలు వృథా కావు: ఎస్పీ శ్రీనివాసరావు

image

పోలీస్ అమర వీరుల త్యాగాలు ఎప్పటికీ వృథా కావని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.