News April 23, 2025

మెదక్: OU పరిధిలో బీ ఫార్మసీ ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కోర్సు పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీ ఫార్మసీ(పీసీఐ) సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు. -SHARE IT..

Similar News

News April 23, 2025

మోదీ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.

News April 23, 2025

నరకకూపంలా మారుతున్న కశ్మీర్: సల్మాన్

image

ఉగ్రవాదుల దాడితో స్వర్గంలాంటి జమ్మూ కశ్మీర్ నరకంలా మారుతోందని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పహల్‌గామ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అమాయక ప్రజల మృతికి సంతాపం తెలియజేశారు. మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా పహల్‌గామ్ దాడిని ఖండించారు. మతం పేరుతో ఇలాంటి విధ్వంసాలు సృష్టించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

News April 23, 2025

విశాఖలో వైశ్యరాజు జువెలర్స్‌ షోరూం ప్రారంభం

image

విశాఖలోని ఆశీల్‌మెట్ట, సంపత్ వినాయక దరిలో వైశ్యరాజు జువెలర్స్‌ 18KT గోల్డ్ షోరూంను ప్రారంభించినట్లు MD వైశ్యరాజు తెలిపారు. వినయగర్ ప్యారడైజ్, భూస్వాములు లగడపాటి కిరణ్ కుమార్, మంత్రి శేషగిరిలు, నగేశ్‌లతో కలిసి షోరూంను ప్రారంభించారు. ఇండియాలో మొట్టమొదటి 18KT గోల్డ్ షోరూం ఇదేనని MD వైశ్యరాజు పేర్కొన్నారు. 18KT జువెలరీపై తరుగు(VA) 6% నుంచి ఉంటుందన్నారు. ఛైర్మన్ ఫల్గుణరాజు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

error: Content is protected !!