News November 27, 2024

మెదక్: RTCలో ఉద్యోగాలు

image

మాజీ సైనికులను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. మెదక్‌ రీజియన్‌లో 81 పోస్టులను కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT

Similar News

News December 11, 2024

సిద్దిపేట: గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్

image

గ్రూప్-2 పరీక్ష అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి, రూట్ అధికారులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 37 కేంద్రాల్లో 13,714 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు.

News December 10, 2024

మెదక్: ముసాయిదాపై అభ్యంతరాలుంటే ఈనెల 12లోపు తెలపాలి: కలెక్టర్

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 లోపు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో తెలియజేయాలన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ రాజకీయ పార్టీలకు తెలిపారు.

News December 10, 2024

సంగారెడ్డి: మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిశీలన: కలెక్టర్

image

3నెలలకు ఒకసారి ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం పాత డీఆర్డీఏలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లో సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు, తదితర సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు పోలీసుల భద్రత కల్పించినట్లు చెప్పారు.