News March 20, 2025
మెదక్: SSC పరీక్ష కేంద్రాల 163 BNSS సెక్షన్: SP

21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమి కూడొద్దని సూచించారు. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News March 21, 2025
బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు దూరంగా ఉండండి: ఎస్పీ

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్‌లకు అలవాటు పడొద్దని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి, డబ్బులు కోల్పోయి అప్పులపాలై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్స్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన అట్టి వ్యక్తులపై చట్టారీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News March 21, 2025
మెదక్: అంతరిస్తున్న అడవులు..!

జీవకోటికి ప్రాణవాయువు అందించేది అడవులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా అడవి తగ్గడంతో పర్యావరణానికి ముంపు ముంచుకొస్తోంది. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రకారం 6.,89,342 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు భూములు ఉన్నాయి. ఇందులో 6,865 ఎకరాల భూమి అక్రమనకు గురికావడంతో జీవరాసులకు మనుగడ లేకుండా పోతుందని అటవీ సిబ్బంది అధికారులు చెబుతున్నారు.
News March 21, 2025
మెదక్: 10338 మందికి 68 సెంటర్లు

నేటి నుంచి మెదక్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 సెంటర్లలో 10338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 17 సెట్టింగ్స్ స్క్వాడ్స్, 68 చీఫ్ సూపర్డెంట్లు, 70 డిపార్ట్మెంటల్ అధికారులు, 590 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.