News July 8, 2024
మెదక్: TECOA రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్ కుమార్ ఏకగ్రీవం

తెలంగాణ కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సాపూర్‌కు చెందిన మోరే రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ చిక్కడపల్లిలో నిర్వహించిన ఎలక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు. అసోసియేషన్‌గా ఏర్పడిన నాయకులు నేడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాణిక్య ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా జ్యోతి, కొండల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Similar News
News November 4, 2025
మెదక్: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు నిజాంపేట విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా పోటీలకు నిజాంపేట మండలానికి చెందిన విద్యార్థి కార్తీక్ గౌడ్ ఎంపికయ్యాడు. తూప్రాన్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ అండర్-17 ఉమ్మడి మెదక్ జిల్లా రగ్బీ సెలక్షన్లో కార్తీక్ గౌడ్ ఎంపికైనట్లు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం జ్ఞానమాల, పీడీ ప్రవీణ్ తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది.
News November 4, 2025
మెదక్ జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏవైనా అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. అవినీతి అనేది పెద్ద నేరమని, ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే మానుకోవాలని హెచ్చరించారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News November 3, 2025
మెదక్: ప్రజావాణిలో 77 దరఖాస్తులు

మెదక్ కలెక్టరెట్లోని ప్రజావాణిలో మొత్తం 77 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 36, పింఛన్లకు సంబంధించి 07, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 07, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 27 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


