News February 2, 2025

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్

image

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. నెక్కొండ మండలంలో హాస్టళ్లను కలెక్టర్ విస్తృత తనిఖీలు నిర్వహించి, భోజనం రుచి చూసి మాట్లాడారు. హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. పాఠశాల రికార్డులు పరిశీలించి సమయ పాలన పాటించాలన్నారు.

Similar News

News December 1, 2025

అనంతపురంలో రోడ్డెక్కిన అరటి రైతులు

image

అనంతపురం కలెక్టరేట్ వద్ద అరటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన అరటి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అరటి రైతులు రోడ్డెక్కి ఆర్తనాదాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే అరటి రైతులను ఆదుకోకపోతే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని శైలజానాథ్ హెచ్చరించారు.

News December 1, 2025

తిరుపతి జిల్లా ప్రైవేట్ స్కూల్లో భారీ మోసం

image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే నామినల్ రోల్స్ ప్రక్రియ కొనసాగుతుండగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. జిల్లాలో 271 ప్రైవేట్ స్కూల్స్ ఉండగా.. 12,796 మంది పది పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 వసూలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ చాలా స్కూల్లో రూ.1000 తీసుకుంటున్నారు. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎంత కట్టారో కామెంట్ చేయండి.

News December 1, 2025

దిత్వా ఎఫెక్ట్.. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్

image

తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో దిత్వా తుఫాన్ రావడంతో.. వరి పండిస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫానుకు తమ పంట ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా మంది రైతులు వరి కోత సమయం రాకముందే కోసేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కోత యంత్రాల యజమానులు.. ఎకరా పంట కోయడానికి రూ.4వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.