News February 27, 2025
మెరకముడదాంలో వందశాతం పోలింగ్

మెరకముడిదాం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఈ ఎన్నికలలో 100% పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. మెరకముడిదం మండలంలో మొత్తం 55 ఓట్లు ఉండగా మెుత్తం 55 ఓట్లు నమోదైయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదని ఓటింగ్ ప్రశాంతంగా అయిందని అధికారులు తెలిపారు.
Similar News
News January 3, 2026
రేపే భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గగన విహార ముహూర్తం ఖరారైంది. ఆదివారం ట్రయల్ రన్‌గా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా తొలి విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఆ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైతే మే నెల నుంచే సాధారణ విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
News January 3, 2026
బొండపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

బొండపల్లి మండలం, మరువాడ గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పాల్గొన్నారు. రైతుల భూ హక్కులు స్పష్టంగా నమోదై, భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేలా ఈ విధానం రూపకల్పన చేశామన్నారు. క్యూ ఆర్ కోడ్ కలిగిన ఆధునిక పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.
News January 3, 2026
VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

AP KGBV ఔట్‌సోర్సింగ్‌లో 1095 పోస్టులకు <


