News May 4, 2024
మెరకముడిదాం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు
1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాం మండలం గర్భాంకి చెందిన తాడ్డె చినఅచ్చిన్నాయుడు తొలిసారి గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాంకి చెందిన ముదుండి సత్యనారాయణరాజు, 1962లో అదే మండలంలో చినబంటుపల్లికి చెందిన కోట్ల సన్యాసప్పలనాయుడు, 1967లో గర్భాంకు చెందిన తాడ్డె రామారావు, 1972లో ఇప్పలవలసకు చెందిన రౌతు పైడపునాయుడులు వరుసగా విజయం సాధించారు.
Similar News
News November 5, 2024
ఆర్డీవో కార్యాలయాల్లో కౌంటింగ్ కేంద్రాలు: విజయనగరం కలెక్టర్
శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం పార్వతీపురం, విజయనగరం ఆర్.డి.ఓ. కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. నవంబరు 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జరుగుతుందన్నారు. డిసెంబరు 2 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
News November 5, 2024
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్య ఇదే..
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు మొత్తం 727మంది ఉన్నారు. వీరిలో పార్వతీపురం జిల్లాలో 325 మంది ఉండగా, ఇందులో పురుషులు 132, మహిళలు 193 మంది ఉన్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం 402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 239 మంది మహిళా ఓటర్లు, 163 పురుష ఓటర్లు ఉన్నారు. రాజకీయ పార్టీలు ముసాయిదా జాబితాపై తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఈ నెల 8వ తేదీ లోగా తెలియజేయవచ్చు.
News November 5, 2024
విజయనగరం జిల్లా TOP NEWS TODAY
* విజయనగరంలోని పలు ప్రాంతాల్లో రేపు కుళాయిలు బంద్
* గంట్యాడ: 8 మంది అరెస్టు
* ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా జేసీ ఎస్.సేతు మాధవన్
* పార్వతీపురం జిల్లాలో 49 ఆధార్ కేంద్రాలు
* ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలి: కలెక్టర్
* VZM: సంఖ్యాబలంలో వైసీపీనే టాప్..!
* మన్యంలో పెరిగిన చలి తీవ్రత
* ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ ప్రారంభం
* శైవ క్షేత్రాల్లో కార్తిక శోభ