News March 19, 2025
మెరుగైన విద్యుత్ అందించాలి: ఎన్పీడీసీఎల్ సీఎండీ

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సూచించారు. హనుమకొండలోని నక్కలగుట్ట విద్యుత్ భవన్ పరిధిలోని 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోడ్ పెరిగే ఛాన్స్ ఉన్న సర్కిల్లో పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
Similar News
News December 4, 2025
డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.
News December 4, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
News December 4, 2025
NRPT: ‘నషా ముక్త్ భారత్’ అవగాహన వాహనం ప్రారంభం

మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బ్రహ్మకుమారీల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనాన్ని గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సమాజ అభివృద్ధికి మాదక ద్రవ్యాల నిర్మూలన అత్యంత కీలకమన్నారు.


