News August 14, 2024
మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ ప్రావీణ్య
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. పరకాలలోని ప్రభుత్వ ఆసుపత్రిని నేడు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించి ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని రోగులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News September 15, 2024
MHBD: 6 నెలల క్రితం వివాహం.. ఉరేసుకొని ఆత్మహత్య
MHBD జిల్లా సీరోల్ మండలం మన్నెగూడెంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వినేశ్ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి గత 6 నెలల క్రితం వివాహమైంది. సమాచారం తెలుసుకున్న డోర్నకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
News September 15, 2024
నిమజ్జనం సందర్భంగా వరంగల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ ట్రైసిటీస్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ ఆంక్షలు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఖమ్మం, ములుగు, నర్సంపేట, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఆంక్షలు తప్పక పాటించాలని తెలిపారు.
News September 15, 2024
వరంగల్: రేపే నిమజ్జనం.. జర భద్రం
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణనాథుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని పద్మాక్షి గుండం, బంధం చెరువు, చిన్న వడ్డేపల్లి, ఉర్సు, కోట, బెస్తం చెరువు, ఇతర ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మీ గణేశుడి నిమజ్జనం ఎప్పుడు? కామెంట్ చేయండి.