News February 14, 2025
మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

మేడారం జాతరకు వస్తున్న భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO గోపాలరావు అన్నారు. మేడారంలోని ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య శిబిరానికి వస్తున్న రోగుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మొత్తం 110 మందికి వైద్యం అందించామని సిబ్బంది తెలిపారు. రోగులకు ఇబ్బంది లేకుండా అత్యవసర మందులను నిల్వ చేసుకోవాలని డీఎంహెచ్వో సూచించారు.
Similar News
News March 27, 2025
భగభాన్ పాలైకి 10ఏళ్ల జైలు శిక్ష విధించిన గుంతకల్ కోర్టు

ఒడిశా రాష్ట్రానికి చెందిన భగభాన్ పాలై అనే వ్యక్తికి గుంతకల్ కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో గంజాయి తరలిస్తూ రైల్వే పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా ముద్దాయికి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
News March 27, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో నేడే ఎన్నికలు

శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని రొద్దం, గాండ్లపెంట, రామగిరి, కనేకల్లు, కంబదూరు మండలాల్లో MPP, ఉరవకొండ, పెద్దపప్పూరు, యల్లనూరు, రాయదుర్గం మండలాలలో వైస్ ఎంపీపీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అనంతపురం జడ్పీ సీఈవో రాజోలి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా మండలాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News March 27, 2025
HYD: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూర్

తెలంగాణ పర్యాటకశాఖ ప్యాకేజీలను సిద్ధం చేస్తుంది. HYD నుంచి పలు కొత్త పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ, మైసూర్, గోవా, అరకు తదితర ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చుట్టేసేలా వీటిని రూపొందిస్తున్నారు. పర్యాటకుల డిమాండ్ ఆధారంగా ప్యాకేజీలను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ ప్యాకేజీలు ప్రారంభం కానున్నాయి.