News November 16, 2024

మెరుగైన సమాజం కోసం కృషి చేయాలి: ఎస్పీ

image

మెరుగైన సమాజం కోసం పోలీసు, ప్రజల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరమని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. విడపనకల్లు మండలం పాల్తూరులో కడ్లే గౌరమ్మ జాతర సందర్భంగా పోలీసు, మైత్రి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభపరిణామం అన్నారు.

Similar News

News September 17, 2025

ఉరవకొండలో పవర్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు

image

ఉరవకొండలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 250 మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 50 గాలి మరలను ఏర్పాటు చేసి గ్రిడ్ అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 320 మందికి ఉపాధి కలుగుతుంది.

News September 16, 2025

కలెక్టర్ల సమావేశానికి హాజరైన అనంత కలెక్టర్

image

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు మంగళవారం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

News September 15, 2025

గుత్తి: 5 టన్నుల టమాటాలు పారబోశారు..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయి. కనీసం ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తికి చెందిన రైతులు 500 బాక్సులను మార్కెట్‌కు తీసుకు వచ్చారు. కిలో రూ.5, రూ.3 మాత్రమే పలకడంతో ఇలా హైవే పక్కన టమాటాలను రైతులు పారబోశారు.