News November 16, 2024
మెరుగైన సమాజం కోసం కృషి చేయాలి: ఎస్పీ
మెరుగైన సమాజం కోసం పోలీసు, ప్రజల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరమని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. విడపనకల్లు మండలం పాల్తూరులో కడ్లే గౌరమ్మ జాతర సందర్భంగా పోలీసు, మైత్రి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభపరిణామం అన్నారు.
Similar News
News December 12, 2024
తనకల్లు మండలంలో 10.2 మి.మీ వర్షపాతం
తనకల్లు మండలంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో గురువారం 10.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి తెలిపారు. నల్లచెరువు మండలంలో 6.2 మి.మీ, గాండ్లపెంట 5.8 మి.మీ, తలుపుల 4.4 మి.మీ, నల్లమడ, కదిరి, చిలమత్తూరు 4.2 మి.మీ, పెనుకొండ 4.0 మి.మీ, నంబులపూలకుంట మండలంలో 3.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
News December 12, 2024
వీరుడికి కన్నీటితో సెల్యూట్
జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ సుబ్బయ్య (45)కు నార్పలలో అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. పోలీసులు, బంధువులు, ప్రజల అశ్రునయనాల మధ్య వారి సొంత వ్యవసాయ పొలంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భార్య, కుమారుడు, కుమార్తె భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.
News December 12, 2024
వీర జవాన్ కుటుంబ సభ్యులకు బండారు శ్రావణి పరామర్శ
జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) భౌతికకాయానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాళి అర్పించారు. భౌతికకాయాన్ని అధికారులు నిన్న రాత్రి నార్పలకు తీసుకురాగా ఆమె సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.