News June 2, 2024

మెలియాపుట్టి: 1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

image

జిల్లా ఎడిషనల్ ఎస్పీ సెబ్ జెడీ డి.గంగాధరం ఆదేశాల మేరకు శనివారం టెక్కలి ఎస్ఈబీ సీఐ రాజశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో మెలియాపుట్టి మండలం నేలబొంతు గ్రామానికి తూర్పు వైపు ఉన్న కొండపై సుమారుగా 1800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను, 30 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయనతోపాటు పలాస డీఎఫ్‌టీ సీఐ రామచంద్ర కుమార్ టెక్కలి ఎస్ఐ జి.గణేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News September 7, 2024

బొరివంకలో అపురూప దృశ్యం

image

వినాయక చవితి రోజున కవిటి మండలం బొరివంక గ్రామంలో అపురూప దృశ్యం కనువిందు చేసింది. గ్రామస్థుడు మజ్జి బోనమాలి తమ తోటలో పెరుగుతున్న కర్ర పెండలం దుంపలో గణనాథుని రూపం కనిపించడంతో సిద్ధి వినాయక మండపం వద్దకు తీసుకొచ్చాడు. వినాయకుని రూపంలోనే ఉండడంతో స్థానిక భక్తులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు చూడటానికి ఎగబడ్డారు.

News September 7, 2024

డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 46 శాతం పీజీ ప్రవేశాలు

image

ఎచ్చెర్ల డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను పీజీ ప్రవేశాలు 46 శాతం నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ పీజీ సెట్-2024 అలాట్ మెంట్‌లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. వివిధ కోర్సుల్లో మొత్తం 562 సీట్లకు గాను 259 సీట్లకు ప్రవేశాలు జరిగాయి. విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంది.

News September 7, 2024

కవిటి ఉద్దాన ప్రాంతంలో మొక్క పెసలతో బొజ్జ గణపయ్య

image

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బోరువంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది (ముగ్ద గణపతి) పెసర విత్తనాలు వేసి నారుతో తయారుచేసిన విగ్రహాన్ని క్లబ్బుకు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగని గణపయ్యలను తయారు చేయడమే ఈయన ప్రత్యేకత.