News January 8, 2025
మెళియాపుట్టిలో సినిమా షూటింగ్ సందడి
మెళియాపుట్టి పరిసర ప్రాంతాల్లో బుధవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తీస్తున్న సినిమా చిత్రీకరణ మండలంలోని కరజాడలో బుధవారం జరిగింది. హీరో, హీరోయిన్లుగా గోపాల్ రెడ్డి, శృతి, ప్రధాన పాత్రల్లో డా.కుమార్ నాయక్, ఆశిష్ చోటు ఉన్నారని సినిమా దర్శకుడు శివశంకర్ తెలిపారు. వీరితో పాటు నిర్మాత స్వాతి ఉన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, ఒడియా మూడు భాషల్లో విడుదల కానుంది.
Similar News
News January 18, 2025
జనసేన నాయకురాలు కాంత్రిశ్రీ మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్
ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ అనారోగ్యంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమె మృతికి సంతాపం తెలిపారు. అనంతరం శాంతిశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆమె ఉత్తరాంధ్రలో చేపట్టిన పలు పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో తనవంతు పాత్ర పోషించారన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News January 18, 2025
SKLM: కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు చేరినవారు వీరే.!
పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలు ఎచ్చెర్ల పోలీస్ ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా పురుష అభ్యర్థులు 327 మంది దేహ దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు.
News January 18, 2025
శ్రీకాకుళం: జనసేన నాయకురాలు కాంతిశ్రీ మృతి
ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతి శ్రీ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో గొలివి ఆసుపత్రిలో చేరిన ఆమె నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా ఈమె ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆర్థిక సహాయాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పార్థివదేహాన్ని సందర్శనార్థం 9 తర్వాత స్వగృహానికి తెస్తారని తెలిపారు.