News February 10, 2025
మేకల బండలో చెంచులతో ముఖాముఖి నిర్వహించిన కలెక్టర్

శ్రీశైలంలోని మేకల బండ చెంచు కాలనీలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ చెంచులతో సోమవారం రాత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చెంచుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చెంచుల సమస్యలను అధికారులు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. వారి వెంట ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
మక్తల్: మంత్రి ఇలాకాలో గుంతల రోడ్లు..!

రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలో రోడ్డు పరిస్థితులు అధ్వానంగా మారడం వల్ల ధాన్యం తరలిస్తున్న లారీలు తరచుగా దిగబడుతున్నాయి. మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు, మక్తల్ పట్టణ సమీపంలో పూర్తి స్థాయిలో గుంతలుగా మారడంతో రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం ప్రాయంగా మారింది. తాజాగా వడ్లు తీసుకొస్తున్న లారీ శనివారం ఉదయం గోతులలో ఇరుక్కుపోయింది.
News November 22, 2025
రాష్ట్రంలో 78 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS,MD,MS,DNB,PG డిగ్రీ, పీజీ డిప్లొమా, DM,M.CH,MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్సైట్: https://rajannasircilla.telangana.gov.in./
News November 22, 2025
ఖమ్మం: ఎన్నికల కోలాహలం.. రిజర్వేషన్లపై అయోమయం

డిసెంబరులో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని ఆశిస్తున్న ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. ఖమ్మంలో 571, భద్రాద్రిలో 471 గ్రామ పంచాయతీలు ఉన్న విషయం తెలిసిందే.


