News August 13, 2024
మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సుంకిశాల ప్రాజెక్టు సందర్శించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దవూర మండలం సుంకిశాల ప్రాజెక్ట్ ను బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి మాట్లాడారు. హైదరాబాద్‌కు తాగునీరు అందించడం కోసం ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేపడుతున్న నిర్మాణ దశలోనే దృశ్యాలు వైరల్ అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
Similar News
News November 25, 2024
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి!
నల్గొండ జిల్లాలో చలి పంజా విసురుతుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో ప్రజలు చలిమంటలు కాచుకోక తప్పడం లేదు. గత రెండు మూడు రోజులుగా జిల్లాలో 19 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చలి తీవ్రత కారణంగా వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News November 25, 2024
NLG: ముగింపు దశకు ధాన్యం సేకరణ
ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈఏడాది నల్గొండ జిల్లాలో 370, సూర్యాపేట జిల్లాలో 310, యాదాద్రి భువనగిరి జిల్లాలో 372 కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు ధాన్యాన్ని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో అంచనాలకు మించి ధాన్యాన్ని రైతులు మార్కెట్లకు తీసుకువచ్చారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 4,24,135 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
News November 25, 2024
చింతలపాలెంతో నాకు 30 సంవత్సరాల అనుబంధం :మంత్రి ఉత్తమ్
చింతలపాలెం మండలంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న చింతలపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చింతలపాలెం మండలానికి రెండు కోట్లతో సీసీ రోడ్డు మంజూరు చేయించానన్నారు.మండలం అభివృద్ధికి ఎల్లపుడూ కృషి చేస్తానని తెలిపారు.