News August 13, 2024

మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

image

మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సుంకిశాల ప్రాజెక్టు సందర్శించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దవూర మండలం సుంకిశాల ప్రాజెక్ట్ ను బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి మాట్లాడారు. హైదరాబాద్‌కు తాగునీరు అందించడం కోసం ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేపడుతున్న నిర్మాణ దశలోనే దృశ్యాలు వైరల్ అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

Similar News

News September 15, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా సాగర్ నిండింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా 312 టీఎంపీల నీరుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 77,334 క్యూసెక్కుల నీరుంది.

News September 15, 2024

నల్గొండ: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

image

దామరచర్ల మండలం పుట్టలగడ్డతండాలో ఓ యువతి అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. స్థానికుల వివరాలిలా.. మాల్‌తండా వాసి మౌనిక, పుట్టలగడ్డ తండాకు చెందిన రంగా ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకోవాలని అమ్మాయి కోరడంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఈ తెల్లవారుజామున మౌనిక విగతజీవిగా కనిపించింది. అమ్మాయి కుటుంబ సభ్యులు రంగా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 15, 2024

NLG: వినాయక మండపంలో విషాదం

image

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం జరిగింది. కిష్టరాంపల్లికి చెందిన వర్ధన్ అనే విద్యార్థి వినాయక మండపంలో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా వర్ధన్ చింతపల్లిలో ఇంటర్ చదువుతున్నాడన్నారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.