News February 10, 2025

మేడారం: జంపన్నవాగు వద్ద వెలగని లైట్లు

image

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులు ముందస్తు మొక్కుల కోసం మేడారానికి తరలివస్తున్నారు. భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే ముందు జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తారు. స్నానఘట్టాల వద్ద లైట్లు లేకపోవడంతో రాత్రివేళలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాగు వద్ద లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Similar News

News October 23, 2025

వరంగల్: వారే టార్గెట్.. రూ.లక్షల్లో వసూలు..!

image

ఇటీవల ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద ACB దాడులు, వరంగల్ ములుగు రోడ్డులోని మత్స్యశాఖ కార్యాలయంలో సిబ్బందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం తర్వాత, ACB అధికారులంటూ రవాణాశాఖ సిబ్బందికి కాల్స్ రావడం కలకలం రేపుతోంది. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న అధికారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ACB అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. సైబర్ మోసాలతో భయపడి కొందరు అధికారులు రూ.లక్షల్లో చెల్లించి మౌనం వహిస్తున్నారు.

News October 23, 2025

మండవల్లి: షార్ట్ సర్క్కూట్‌తో ఎలక్ట్రీషయన్ మృతి

image

మండవల్లి మండలం మండవల్లి గ్రామానికి చెందిన చిగురుపాటి సుకుమార్ (24) ప్రైవేట్ ఎలక్ట్రీషయన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పెదపాడు మండలం ఏపూరులో ఎలక్ట్రికల్ లైన్లు మార్చే పనికి వెళ్ళాడు. ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కిన కొద్దిసేపటి‌కే అతను విద్యుత్ ఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి పనివారు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

News October 23, 2025

నంగునూర్: కొనుగోలు కేంద్రాలపై కోతుల దండయాత్ర

image

నంగునూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కోతులు గుంపుగా దండెత్తుతున్నాయి. వడ్ల రాశులపై కోతుల గుంపులు దండెత్తి ధాన్యాన్ని తినివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై దాడి చేస్తుండటంతో మహిళలు, చిన్నారులు భయపడుతున్నారు. కోతుల బెడద నుంచి కాపాడాలని, మార్కెట్ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.