News March 10, 2025
మేడారం జాతరకు అప్రమత్తంగా ఉండాలి: సీతక్క

ములుగు జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు. రానున్న మహా మేడారం జాతరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 10, 2025
వరంగల్: సింగల్ పట్టి మిర్చి రూ. 39వేలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి సోమవారం అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.17వేలు పలకగా,1048 రకం మిర్చి రూ.11వేలు, 5531 రకం మిర్చికి రూ. 11,300 ధర వచ్చింది. అలాగే ఎల్లో మిర్చికి రూ.20 వేలు, టమాటా మిర్చికి రూ.28వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.39వేల ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
News March 10, 2025
ములుగు జిల్లాకు రేపు గవర్నర్ రాక!

ములుగు జిల్లాలో రేపు (మంగళవారం)రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటించనున్నారు. తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని ఇటీవల గవర్నర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. కాగా గ్రామంలో పలు రకాల అభివృద్ధి పనులను అధికారులు చేపట్టారు. గ్రామపంచాయతీ, రోడ్లు, గ్రామాభివృద్ధికి సంబంధించి వివిధ రకాల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఆ పనులను పరిశీలించేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News March 10, 2025
తాడ్వాయి: ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి: DMHO

ఎండాకాలంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ములుగు డీఎంహెచ్వో గోపాలరావు మహిళలకు అవగాహన కల్పించారు. తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రపరిధిలోని కొండపర్తిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడారు. నీటిని ఎక్కువగా తాగాలని, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు తలకు రుమాలు, టవళ్లు చుట్టుకోవాలన్నారు. వడదెబ్బకు గురైతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు.