News January 11, 2026
మేడారం జాతరలో అత్యవసర సేవలకు 35 అంబులెన్సులు

మేడారం జాతరలో అత్యవసర వైద్య సేవలకు 35 అంబులెన్సుల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతరలో గుండెపోటు, ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను ములుగు ప్రభుత్వ ఆసుపత్రి, ఎంజీఎంకు తరలించడానికి 108 అంబులెన్స్‌లను ఉపయోగిస్తారు. హాస్పిటళ్లలో 24 గంటలు డాక్టర్ అందుబాుటలో ఉంటారు.
Similar News
News January 17, 2026
సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

BRS ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేసి క్రెడిట్ కొట్టేయడమే కాంగ్రెస్ పాలనగా మారిందని హరీశ్ రావు ఆగ్రహించారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ నిర్మించిందేమీ లేదని, కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నియామక పత్రాలే రేవంత్ రెడ్డికి రెడీమేడ్‌గా దొరికాయని విమర్శించారు. ప్రాజెక్టుల పేర్లు మార్చి ప్రజల మనోభావాలు అవమానిస్తున్నారని, భూసేకరణ, కాలువల పనులు చేయక రైతులను మోసం చేస్తున్నారన్నారు.
News January 16, 2026
జనగామ: గాదె ఇన్నయ్యకు తాత్కాలిక బెయిల్ మంజూరు

జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌కు చెందిన గాదె ఇన్నయ్యకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి మరణించారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాదె ఇన్నయ్యకు కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల కానున్నారు.
News January 16, 2026
రేపు మేడారం ట్రస్ట్ బోర్డు ఛైర్‌పర్సన్ ప్రమాణస్వీకారం

మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్‌పర్సన్‌గా తాడ్వాయి మండలానికి చెందిన ఈర్పా సుకన్యను ప్రభుత్వం నామినేట్ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు మేడారంలోని సమ్మక్క భవన్‌లో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


