News February 14, 2025
మేడారం జాతర.. మూడవ రోజు కొనసాగుతున్న మొక్కులు

మినీ మేడారం జాతరకు మూడవ రోజు శుక్రవారం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈనెల 12 నుంచి ప్రారంభమైన మినీ జాతర ఈనెల 15 వరకు జరగనుంది. ఈ మినీ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు.
Similar News
News November 4, 2025
ప్రజా సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించండి: SP

ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 54 ఫిర్యాదులు స్వీకరించి, వాటిలో భూగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ స్పందనతో 7 రోజుల్లో పరిష్కారం కల్పించాలని సూచించారు.
News November 4, 2025
MBNR: U-14, 17 కరాటే.. నేడు ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-14, 17 విభాగంలో కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీఎఫ్ కార్యదర్శి Dr.ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. నవంబర్ 4న మహబూబ్నగర్లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్లో ఎంపికలు నిర్వహిస్తామని, అండర్-14 విభాగంలో 1.1.2012లో, అండర్-17 విభాగంలో 1.1.2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని, ఆసక్తిగల బాల, బాలికలు పీడీ నరసింహను (94928 94606) సంప్రదించాలన్నారు.
News November 4, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,12,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


