News February 14, 2025

మేడారం జాతర.. మూడవ రోజు కొనసాగుతున్న మొక్కులు

image

మినీ మేడారం జాతరకు మూడవ రోజు శుక్రవారం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈనెల 12 నుంచి ప్రారంభమైన మినీ జాతర ఈనెల 15 వరకు జరగనుంది. ఈ మినీ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు.

Similar News

News March 27, 2025

ప్రభాస్ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ

image

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తెను ఆయన వివాహం చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని ఖండించింది. అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతకుముందు భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

News March 27, 2025

ఇంజనీరింగ్ కళాశాలను కరీంనగర్‌లోనే ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ

image

శాతవాహన యూనివర్సిటీకి నూతనంగా ఇంజనీరింగ్, లా కళాశాలలు మంజూరు కాగా.. ఇంజనీరింగ్ కలశాలను హుస్నాబాద్‌కు తరలిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీలో వీసీకి వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ కళశాలను కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్, అజయ్, విష్ణు, అంజన్న, కిరణ్మయి, నందు ఉన్నారు.

News March 27, 2025

మంచిర్యాల: ఈ నెల 28న మినీ జాబ్ మేళా

image

మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న ఉదయం10.30గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. అపోలో ఫార్మసీ మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్‌లో ఫార్మసిస్ట్ 40, ట్రైనింగ్ ఫార్మాసిస్ట్ 20, ఫార్మసీ అసిస్టెంట్30, రిటైల్ ట్రైనీ అసిస్టెంట్10ఖాళీలు ఉన్నాయన్నారు.18నుంచి 35లోపు వయస్సు, అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!