News January 11, 2026
మేడారం: టూర్లతో పనులకు బ్రేకులు!

అసలే మేడారం జాతరకు టైమ్ లేదు. మరోపక్క ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే 7 సార్లు వచ్చిన మంత్రి పొంగులేటి, ఆదివారం మరోసారి వస్తున్నారు. ఆయనతో పాటుగా నలుగురు మంత్రులు వస్తుండటంతో జాతర పనులకు ఆటంకం ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు. అసలే సమయం లేకపోగా, మంత్రుల వరుస పర్యటనతో 3 నుంచి 4 గంటల పాటు పనులు నిలిచిపోతున్నాయి. మరోపక్క భక్తులు సైతం పోటెత్తుండటంతో ఈ పనులు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
Similar News
News January 17, 2026
పాలమూరులో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: CM

పాలమూరు గడ్డపై నిర్వహించిన బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసిందని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలిసేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
News January 17, 2026
DRDOలో JRF, RA పోస్టులు

<
News January 17, 2026
ఏలూరు: రైలు ఢీకొని మహిళ మృతి

ఏలూరు నగరంలోని రామకృష్ణపురం వద్ద రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వివాహిత మృతి చెందింది. మృతురాలిని గొల్లగూడెంకు చెందిన ఐ.ప్రియాంక(27)గా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. మృతురాలికి ఇద్దరు సంతానం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


