News January 25, 2025
మేడారం భక్తులకు ఇబ్బందులు కలగకూడదు: మంత్రులు

మేడారంలోని ఐటీడీఏ క్యాంప్ కార్యాలయంలో మేడారం మినీ జాతర రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. మినీ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Similar News
News October 22, 2025
48 మందికి మాత్రమే అనుమతి: పోలీసులు

మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియచేసేందుకు బుధవారం ఛలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో 48 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పాయకరావుపేట సీఐ అప్పన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాన్ని సందర్శించేందుకు పోలీసులను అనుమతి కోరిన 48 మందికి మాత్రమే అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలన్నారు.
News October 22, 2025
HYD: తెలుగు వర్శిటీ.. క్రికెట్ జట్టు కెప్టెన్లు వీరే!

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో క్రికెట్ టోర్నీ బుధవారం నిర్వహిస్తున్నట్లు వర్శిటీ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్ Way2Newsతో తెలిపారు. జట్టు సారథులను ఎంపిక చేశామన్నారు.1.TU డెవిల్స్ జట్టు కెప్టెన్గా అమీర్ 2.TU సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ముస్తాక్ 3.TU ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్గా వినోద్ 4.TU వారియర్స్ జట్టు కెప్టెన్గా ప్రవీణ్ 5.TU ది డామినేటర్స్ జట్టు కెప్టెన్గా అరుణ్
News October 22, 2025
నేటి నుంచి కార్తీక వైభవం

శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నేడు ప్రారంభం కానుంది. ‘న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్’ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసము, కేశవుడికి సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు శుభప్రదం. * రోజూ ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.