News February 7, 2025
మేడారం భక్తులకు బ్యాటరీ ఆఫ్ టాప్స్

మేడారం మినీ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో బ్యాటరీ ఆఫ్ టాప్స్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనం అనంతరం భక్తులు సమీపంలోని అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో వనభోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నల్లాలను, చేతిపంపులను సైతం ఏర్పాటు చేశారు. కాగా, నీటిని వృథా చేయొద్దని సూచించారు.
Similar News
News April 11, 2026
కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.
News April 11, 2026
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ <
News April 11, 2026
పిట్లం: వేసవి తాపానికి ప్రకృతి ప్రసాదం

వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన చలువ ముంజలు మార్కెట్లోకి వచ్చేశాయి. పిట్లం మండలం కుర్తి గేట్ వద్ద తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ డజను ముంజలు రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ముంజలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది.


