News February 4, 2025
మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 15, 2025
ఎన్నికల రోజు స్థానిక సెలవు: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంతో ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. డిసెంబర్ 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. మూడో విడతలో 4 మండలాల పాఠశాలకు సెలవులు ప్రకటించారు.
News December 15, 2025
కామారెడ్డి: మూడో విడత ఎన్నికలు.. ర్యాండమైజేషన్ పూర్తి

కామారెడ్డి జిల్లాలో జరగనున్న మూడో విడత జీపీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది ఎంపికకు సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ సోమవారం పూర్తైంది. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సాధారణ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. బాన్సువాడ డివిజన్ పరిధిలోని 8 మండలాల పోలింగ్ సిబ్బందిని ఈ ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
News December 15, 2025
కలెక్షన్ల సునామీ.. రెండో వీకెండ్లో రూ.146కోట్లు

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన రెండో వీకెండ్(శుక్ర, శని, ఆదివారం)లో అత్యధిక కలెక్షన్లు(రూ.146.60 కోట్లు) సాధించిన హిందీ చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు హిందీలో పుష్ప-2, ఛావా సినిమాలు మాత్రమే సెకండ్ వీకెండ్లో ₹100కోట్లు సాధించినట్లు తెలిపాయి. ఓవరాల్గా ధురంధర్ ₹553Cr సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.


