News February 4, 2025
మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 18, 2025
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నర్సంపేట -పాకాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్‌కు చెందిన వెంకటేశ్ నర్సంపేటలో షాపులో పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.
News February 18, 2025
భారత్‌లో అడుగుపెట్టనున్న టెస్లా..!

ఈవీ దిగ్గజం టెస్లా భారత్‌లో రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఈ మేరకు లింక్డిన్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. కస్టమర్‌రిలేటడ్, బ్యాక్ఎండ్ జాబులు భర్తీ చేయనుంది. జాబ్‌లొకేషన్ ముంబయి, ఢిల్లీఅని పేర్కొంది.ఇటీవలే భారత్ రూ.34 లక్షల పైన ధర ఉన్నకార్లకి ట్యాక్స్ 110శాతం నుంచి70కు తగ్గించింది. అంతేకాకుండా మోదీUSA పర్యటనలో ప్రధానితో మస్క్‌భేటీఅయ్యారు. ఈ నేపథ్యంలో టెస్లా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.