News February 4, 2025

మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

image

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 17, 2025

పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

image

పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత మంగళవారం తీర్పు చెప్పారు. చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన సయ్యద్ లాలూ అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. 14 మంది సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

రాత్రిళ్లు, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి: వరంగల్ సీపీ

image

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించేందుకు వీక్షణ సామర్థ్యం తక్కువుగా ఉంటుందన్నారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోవాలన్నారు.