News February 4, 2025
మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 19, 2025
కళ్యాణదుర్గం కానిస్టేబుల్‌కు జిల్లా ఎస్పీ అభినందన

ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన కళ్యాణదుర్గం కానిస్టేబుల్ షఫీని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అభినందించారు. పతకాలను ప్రదానం చేయడంతో పాటు కానిస్టేబుల్‌ను సన్మానించారు. కాగా షఫీ 100 మీటర్స్ ఈవెంట్‌లో 3వ స్థానం, 200, 400 మీటర్స్‌లో ప్రథమ స్థానం, 4×100 రిలేలో 2వ స్థానం సాధించారు. మార్చి 4 నుంచి 9 వరకు బెంగుళూరులో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించారు.
News February 19, 2025
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిర్చి యార్డ్‌కు చేరుకోనున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ అక్కడి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఫీజు పోరు నిరసనల్ని కోడ్ దృష్ట్యా వైసీపీ వాయిదా వేసుకుంది.
News February 19, 2025
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

AP: నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉ.9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ పడనుంది. వేడుకల్లో భాగంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాధారణ భక్తులకు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.