News February 4, 2025

మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

image

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News February 18, 2025

కరీంనగర్: వ్యక్తిపై హత్యాయత్నం.. కేసు నమోదు

image

ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరగగా బాధితుడికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన కొమురయ్య, అదే గ్రామానికి చెందిన రవి మధ్యలో భూతగాదాలతో గొడవ జరగగా వారిని ఆపేందుకు వెళ్లిన బత్తిని సాగర్‌పై రవి కొడవలితో దాడి చేశాడు. సాగర్‌కు తీవ్ర గాయాలవగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News February 18, 2025

విద్యార్థిని ఆత్మహత్య వివాదం.. క్షమాపణలు చెప్పిన యూనివర్సిటీ

image

నేపాలీ విద్యార్థిని ఆత్మహత్యపై చెలరేగిన <<15496306>>వివాదంపై<<>> ఒడిశాలోని కళింగ యూనివర్సిటీ క్షమాపణలు చెప్పింది. విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. వర్సిటీలో చదివే నేపాలీ విద్యార్థిని ప్రకృతి 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా మాజీ ప్రియుడి వేధింపులే కారణమంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని వారినీ సిబ్బంది బెదిరించడం వివాదానికి దారితీసింది.

News February 18, 2025

ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛా యుత, పారదర్శకంగా జరిగేలా చూడాలని తెలిపారు.

error: Content is protected !!