News May 20, 2024
మేడారం: రెండు రోజులు సమ్మక్క- సారాలమ్మ దర్శనాలు నిలిపివేత

తమ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేయనున్నారు. ఆదివారం గద్దెల వద్ద పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించారు. వరంగల్లో తమకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే 2రోజులు దర్శనాల నిలిపివేతకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
Similar News
News September 16, 2025
సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ హాల్టింగ్

కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్కు సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈనెల 18 నుంచి సికింద్రాబాద్-నాగ్పూర్(20102), ఈనెల 19 నుంచి నాగ్పూర్-సికింద్రాబాద్(201010) ఎక్స్ప్రెస్ సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లో అధికారికంగా హాల్టింగ్ అవుతుందని స్పష్టం చేశారు.
News September 16, 2025
అనేక మలుపులు తిరిగిన చౌటపల్లి సొసైటీ వ్యవహారం..!

చౌటపల్లి సొసైటీ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరికి పాలకవర్గం రద్దయ్యింది. కార్యాలయానికి నూతన భవనం, గోదాం, చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో ఖర్చుకు మించిన లెక్కలు రాశారని ఆరోపణలు వచ్చాయి. ఆయా భవనాలను ప్రారంభించడానికి మంత్రి సీతక్క రావడంతో ఆమె ప్రోగ్రాం ఖర్చుని సైతం అధికంగా చూపారు. కేవలం అరటిపండ్లకే రూ.60 వేలు ఖర్చయినట్లు రాశారు. దీంతో ఆడిటింగ్ చేసి పాలకవర్గాన్ని రద్దు చేశారు.
News September 16, 2025
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు సార్వత్రిక ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ డా.సత్యశారద కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు ఉన్నారు.