News January 30, 2025
మేడారం: విద్యుత్ శాఖ పనులను పూర్తి చేయాలి: TGNPDCL CMD

రానున్న మినీ మేడారం జాతరకు విద్యుత్ శాఖ పనులు పూర్తి చేయాలని టీజీఎన్పిడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అన్నారు. ఈరోజు మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని, మేడారంలో జరుగుతున్న విద్యుత్ పనులను పరిశీలించారు. జాతరకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జాతరకు విద్యుత్ శాఖ తరఫున సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారన్నారు.
Similar News
News February 9, 2025
చిలుకూరు అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు <<15408903>>రంగరాజన్‌పై దాడి<<>> చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
News February 9, 2025
తాండూర్‌కు వాసి డా.జయప్రసాద్‌కు ఉత్తమ అవార్డు

తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డా.జయప్రసాద్(జనరల్ సర్జన్)కు మరోసారి ఉత్తమ అవార్డు దక్కింది. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ వైద్యుడిగా అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ డా.జయప్రసాద్‌కు ఉత్తమ అవార్డును అందజేశారు.
News February 9, 2025
వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో మాదే అధికారం: ధర్మేంద్ర ప్రధాన్

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. 2019 నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ 30-40 శాతంగా ఉంటోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు మరో 10శాతం ఓట్లు అవసరమని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సీఎం మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.