News February 8, 2025

మేడారానికి బస్సు ప్రారంభం

image

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News December 15, 2025

ఖమ్మం: చెల్లిపై 13 ఓట్లతో సర్పంచిగా గెలిచిన అక్క

image

నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. సర్పంచ్‌ పదవి కోసం ఏకంగా అక్కాచెల్లెళ్లు పోటీ పడటం గ్రామంలో చర్చకు దారితీసింది. తోడల్లుళ్ల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలే ఈ పోరుకు కారణమయ్యాయి. ఈ పోటీలో, అక్క మన్నెంపూడి కృష్ణకుమారి తన చెల్లెలు చిట్టూరి రంగమ్మపై కేవలం 13 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప తేడాతో చెల్లిపై అక్క గెలవడంతో ఆమె మద్దతుదారులు సంబురాలు చేసుకున్నారు.

News December 15, 2025

నిర్మల్: ఒక ఓటుతో సర్పంచ్

image

నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్‌ సర్పంచిగా ముత్యాల శ్రీవేద గెలుపొందారు. కేవలం ఒక్క ఓటు తేడాతో సమీప ప్రత్యర్థి హర్షస్వాతిపై విజయం సాధించారు. శ్రీవేదకు 189, హర్షస్వాతికి 188 ఓట్లు దక్కగా ఒక ఓటు చెల్లలేదు. ఈ విజయంతో శ్రీవేద కుటుంబం నుంచి ముచ్చటగా ముగ్గురు సర్పంచులుగా ఎన్నికైనట్లయింది. గతంలో ఆమె తాత నారాయణరెడ్డి, చిన్నమ్మ రజిత సర్పంచులుగా పనిచేశారు.

News December 15, 2025

అల్లూరి: మహిళా ఉద్యోగులకు శుభవార్త

image

మహిళ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ జీవో సంక్రాంతి లోగా జారీ అయ్యేవిధంగా కృషి చేస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు హామీ ఇచ్చారు. ఆదివారం కశింకోట శారదా వనంలో పీఆర్టీయూ నిర్వహించిన వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. పదో తరగతి వంద రోజుల ప్రణాళికలో సెలవులను మినహాయించాలని సూచించారు. సీపీఎస్ రద్దుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ పాల్గొన్నారు.