News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 8, 2026
NLG: 22 మంది ఎంఈఓలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 22 మంది మండల విద్యాధికారులపై (MEOs) నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 30 నాటికి పూర్తి కావాల్సిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాల విషయంలో అలసత్వం వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News February 8, 2026
‘ముస్తాబు’తో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారాలి: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సమూల మార్పులతోనే ‘స్కూల్ ముస్తాబు’ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ప్రభాకర రెడ్డి అన్నారు. బెలగాంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల బాధ్యత తీసుకోవాలని, గేటు నుంచి తరగతి గదుల వరకు మార్గాన్ని అందమైన పూలు, పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
News February 8, 2026
KNR: మున్సిపల్ ఎన్నికలు.. ఫేక్ సర్వేలు!

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో అభ్యర్థులు ఫేక్ సర్వేలకు తెరలేపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తమ పార్టీ గెలుస్తుందంటూ నకిలీ సర్వే ఫలితాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ సర్వేలను, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వీటికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేకపోవడంతో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.


