News February 8, 2025

మేడారానికి బస్సు ప్రారంభం

image

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News February 12, 2026

KMR: కౌంటింగ్‌కు 261 మంది సిబ్బంది

image

కామారెడ్డి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో మొత్తం 261 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు వెల్లడించారు. 81 మంది సూపర్‌వైజర్లు, 174 మంది అసిస్టెంట్లను నియమించారు. కామారెడ్డి(114)- సూపర్‌వైజర్లు 38, అసిస్టెంట్లు 76, బాన్సువాడ(63)- సూపర్‌వైజర్లు 21, అసిస్టెంట్లు 42, బిచ్కుంద(42)- సూపర్‌వైజర్లు 14, అసిస్టెంట్లు 28, ఎల్లారెడ్డి(42)-సూపర్‌వైజర్లు14, అసిస్టెంట్లు 28 మందిని నియమించారు.

News February 12, 2026

యాదాద్రిలో దర్శకుడు గుణశేఖర్ పూజలు

image

సినీ దర్శకుడు గుణశేఖర్ గురువారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. గుణశేఖర్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

News February 12, 2026

PDPL: అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారం

image

అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, ₹15 వేల జరిమానా విధిస్తూ PDPL జడ్జి సునీత గురువారం తీర్పు ఇచ్చారు. కాల్వ శ్రీరాంపూర్ PS పరిధిలో ఓ మహిళపై నాలుగేళ్ల క్రితం MNCL జిల్లా నస్పూర్ CCCకి చెందిన నిందితుడు కొర్లపాటి అరుణ్ పై కేసు నమోదైంది. విచారణ అనంతరం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితునికి శిక్ష పడే విధంగా కృషి చేసిన ప్రాసిక్యూషన్, పోలీసు అధికారులు, సిబ్బందిని CPఅభినందించారు.