News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 23, 2026
ట్రంప్ టారిఫ్‌ల వసూళ్లు రేపటి నుంచి బంద్

US అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్స్ చెల్లవన్న సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యూఎస్ కస్టమ్స్& బోర్డర్ ప్రొటక్షన్ చర్యలు ప్రారంభించింది. IEEPA(ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్) ప్రకారం ట్రంప్ విధించిన టారిఫ్‌ల వసూళ్లను రేపటి నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దిగుమతిదారులకు సమాచారం అందించామంది. ఇప్పటి వరకు చెల్లించిన టారిఫ్‌లు రిఫండ్ చేస్తారా? అనేది క్లారిటీ ఇవ్వలేదు.
News February 23, 2026
విశాఖ: సేవ పునర్విక పేరుతో దోపిడీ

విశాఖపట్నం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం ఎదురుగా సోమవారం సేవ్ పునర్విక పేరుతో స్కానర్లు పట్టుకుంటూ సేవ పేరుతో ముగ్గురు వ్యక్తులు అనధికార దోపిడీకి తెర లేపారు. కనీసం ఆ పాప పేరు పలకడం తెలియడం లేదు వాళ్లకి, అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే భీమవరానికి చెందిన వారిమని చెబుతున్నారు. స్థానికులు కాదు సేవ తప్పు దోవ పడుతుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News February 23, 2026
నారాయణపేట: MLAకు మద్దతుగా BJP నిరసన

నారాయణపేట జిల్లా మరికల్‌లో సోమవారం బీజేపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు గూండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మండలాధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


