News February 8, 2025

మేడారానికి బస్సు ప్రారంభం

image

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News February 14, 2026

దుబ్బాకలో మహిళా లీడర్ల డబుల్ విక్టరీ

image

దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో మహిళా నేతలు తమ పట్టు నిరూపించుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఆస సులోచన(11వ వార్డు), సంధ్య రాణి (6వ వార్డు) వరుసగా రెండోసారి కౌన్సిలర్లుగా ఎన్నికై కొత్త రికార్డు సృష్టించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వీరిద్దరూ భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం. రెండోసారి గెలుపొందిన వీరిని స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఘనంగా అభినందిస్తూ సంబరాలు జరుపుకున్నారు.

News February 14, 2026

వంటింటి చిట్కాలు మీ కోసం

image

* పూరీలు తెల్లగా ఉండాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* ఆలూతో కలిపి నిల్వచేస్తే వెల్లుల్లి తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోవు.

News February 14, 2026

పాయిజన్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోబోయి..!

image

నలుగురు బాలికలు చేసిన వింత ప్రయోగం వారి ప్రాణాలను బలితీసుకుంది. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఐదుగురు స్నేహితులు సరదాగా పొలానికి వెళ్లి పక్షులను చంపే విషాన్ని నీళ్లలో కలుపుకొని తాగారు. నలుగురు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోగా ఒక బాలిక వెంటనే ఉమ్మేయడంతో ప్రాణాలతో బయటపడింది. అయితే చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారని తల్లిదండ్రులు మందలించారనే బాధతో వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.