News July 17, 2024
మేడిగడ్డలో పెరిగిన గోదావరి ప్రవాహం

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 49,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా, వచ్చిన వరదను వచ్చినట్లుగా 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదులుతున్నారు.
Similar News
News November 17, 2025
వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.

వరంగల్: ప్రజావాణిలో 124 వినతుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్య రాణి హాజరై ప్రజలు ఇచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 124 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో అధిక శాతం రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ సమస్యలకు సంబంధించినవని అధికారులు పేర్కొన్నారు.