News June 5, 2024

మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భూపరీక్షలు

image

మేడిగడ్డ బ్యారేజ్‌లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు భూపరీక్షలు ప్రారంభించారు. బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మట్టి, మెటీరియల్ నమూనాలను సేకరిస్తున్నారు. బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలను నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News October 2, 2024

HSBD: బాపు షూట్‌లో గాంధీ జయంతి వేడుకలు

image

భారత జాతిపిత మాత్మ గాంధీ జయంతి వేడుకలను లాంగర్ హౌస్‌లోని బాబు షూట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మహాత్ముడికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సత్యం అహింస శాస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహనీయుడు అని అన్నారు.

News October 2, 2024

KNR: ఒక్కో రోజు ఒక్కో రూపంలో బతుకమ్మ

image

బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఒక్కోరోజు ఒక్కో రూపంలో మహిళలు పూలతో బతుకమ్మను పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగింపు.

News October 2, 2024

కరీంనగర్: నేడు ఎంగిలిపూల బతుకమ్మ

image

నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆట పాటలతో నిర్వహిస్తారు. మొదటి రోజైన అమావాస్య నాడు ‘ఎంగిలిపూల’ బతుకమ్మను పేరుస్తారు. సాధారణంగా మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ మొదలవుతుంది. ఆనాడు ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. పిండ ప్రదానం చేయలేని వాళ్లు పెద్దల పేరిట బ్రాహ్మణుడికి సాయిత్యం (వంట సామగ) ఇస్తారు.