News February 7, 2025
మేడిపల్లిలో హై వోల్టేజ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ..!

మేడిపల్లి పరిధిలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లో హై వోల్టేజ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ ఉన్నట్లుగా సైంటిస్టులు తెలిపారు. ఇందులో కేంద్ర వ్యాప్తంగా ఉన్న నిష్ణాతులైన ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఇందులో వివిధ రకాల పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక అవుట్‌డోర్ డీసీ టెస్టింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.
Similar News
News February 7, 2026
పార్వతీపురం: ఉగాది లోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్లను ఉగాది పండుగ లోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణాల్లో సంబంధిత మండలాల్లో పెండింగ్‌లో ఉన్న 1500 ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
News February 7, 2026
VZM: పన్నులు వసూలు చేయకపోతే చర్యలు తప్పవు: కమిషనర్

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ఫిబ్రవరి 15 నాటికి శతశాతం పన్నులు వసూలు కావాలని పంచాయితీ రాజ్ కృష్ణ తేజ ఆదేశించారు. పట్టణంలోని ఓ హోటల్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ నెల 28లోపు లక్ష్యాలను పూర్తి చేయాలని, ఫిబ్రవరి 15లోపు శతశాతం వసూలు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 7, 2026
విశాఖ: ఈనెల 14 నుంచి సముద్రంపై చేపల వేట నిషేధం

ఐఎఫ్‌ఆర్ మిలాన్ కార్యక్రమం నేపథ్యంలో ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, వేట నిషేధం ఉంటుందని మత్స్యకార జేడీ లక్ష్మణరావు తెలిపారు. 30, 37వ వార్డులో కొత్త జాలరి పేట, పెయిందొర పేటలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ సజావుగా సాగేందుకు మత్స్యకాలందరూ సహకరించాలని ఆయన కోరారు.


