News March 18, 2025
మేడిపల్లి : త్రుటిలో తప్పిన ప్రమాదం..!

ఉమ్మడి మేడిపల్లి మండలంలోని రైల్వేస్టేషన్‌లో ప్రమాదం తప్పింది. MDP రైల్వే స్టేషన్లో కొందరు దుండగులు ప్లాట్‌ఫారంపై గల సిమెంట్ బెంచిని రైల్వే ట్రాక్ పై పడేశారు. దీనిని ఉదయం సమయంలో గమనించిన స్థానికులు ఆబెంచిని ట్రాక్ పై నుంచి తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు ఇలాంటివి జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
Similar News
News March 18, 2025
డబుల్ హెల్మెట్ ఎఫెక్ట్.. విశాఖలో 39 బైకులు స్వాధీనం

బైక్‌పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరని విశాఖ ఉప రవాణా కమిషనర్ ఆర్.సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎన్ఏడీ, మద్దిలపాలెం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 39 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే మూడు నెలలపాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తామన్నారు. లైసెన్స్ సస్పెండ్ అయ్యాక వాహనం నడిపితే వాహనం స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.
News March 18, 2025
హైడ్రా పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు: రంగనాథ్

TG: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతంలోనే ప్రకటన చేశామని, ఇప్పటికే హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇలా ఎవరైనా మోసపోతే తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం లేదా స్థానిక పోలీసులనూ ఆశ్రయించవచ్చన్నారు.
News March 18, 2025
NZB: ఇంటర్ పరీక్షలకు 475 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు 2వ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 475 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. జిల్లాలో మొత్తం 16,766 మంది విద్యార్థులకు గాను 16,291 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. మొత్తం 95.9 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు.