News February 12, 2025
మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325851755_15795120-normal-WIFI.webp)
ఘట్కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్‌పేట, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.
Similar News
News February 13, 2025
ఇంగ్లండ్ జట్టుపై కెవిన్ పీటర్సన్ తీవ్ర ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739381362521_1045-normal-WIFI.webp)
భారత్‌తో ODI సిరీస్‌లో ENG జట్టు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ సెషన్ ఆడారు. వారి నిర్లక్ష్యం చూసి నేను షాక్ తిన్నాను. మధ్యలో గోల్ఫ్ మాత్రం ఆడుకున్నారు. వారికి జీతం ఇచ్చేది దేశం కోసం క్రికెట్ ఆడటానికే గానీ గోల్ఫ్ ఆడుకోవడానికి, టూర్‌ని ఎంజాయ్ చేయడానికి కాదు’ అని మండిపడ్డారు.
News February 13, 2025
అమెరికా నిఘా డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739381853860_1045-normal-WIFI.webp)
భారత సంతతి వ్యక్తి తులసీ గబ్బార్డ్ను తమ దేశ నిఘా సంస్థ డైరెక్టర్‌గా అమెరికా అధికారికంగా నియమించింది. తాజాగా జరిగిన సెనేట్ ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌గా అక్కడి 18 నిఘా సంస్థల కార్యకలాపాలను తులసి పర్యవేక్షిస్తారు. కీలక సమస్యలపై ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తారు. అమెరికాపై 2001లో ఉగ్రదాడుల అనంతరం ఈ పదవిని ఏర్పాటు చేశారు.
News February 13, 2025
మెదక్: కాంగ్రెస్‌లో చేరిన మాజీ డీఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739376456073_50139766-normal-WIFI.webp)
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎం.గంగాధర్ బుధవారం ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల గంగాధర్ డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు.