News February 13, 2026

మేడ్చల్‌లో టెన్షన్.. టెన్షన్..!

image

పుర ఎన్నికల సమరంలో తుది ఘట్టానికి ఆసన్నమైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో విజయం ఎవరిది అనేది కాసేపట్లో స్పష్టమవనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన BRS, తాజాగా ఏర్పడిన 3 మున్సిపాలిటీల్లోనూ తన పట్టు కొనసాగిస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఓటరు తీర్పు ఏ పార్టీకి అనుకూలిస్తుందో చూడాలి.

Similar News

News March 13, 2026

ఎల్పీజీ పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచాలి: నిర్మల్ ఎస్పీ

image

జిల్లాలో ఎల్పీజీ పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలను కట్టడి చేయాలని ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులకు సూచించారు. ఎవరైనా అక్రమంగా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ ఉంచడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.

News March 13, 2026

వనపర్తి: పది పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం BNSS-2023 సెక్షన్ 163 (గతంలోని 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,212 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

News March 13, 2026

‘రామాయణంలో పిడకల వేట’ అంటే?

image

ముఖ్య విషయాన్ని వదిలేసి పనికిరాని వాటి గురించి మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. పండితులు రామాయణం చెబుతుండగా ఓ మహిళ ఇంటి దగ్గర పిడకలు ఏమయ్యాయోనని మధ్యలో అనడంతో ‘రామాయణంలో పిడకల వేట’ వాడుకలోకి వచ్చింది. అలాగే రామాయణంలో ‘త్రిపిటికా:’ అని ఉంది. బౌద్ధ గ్రంథాలనూ ‘త్రిపిటికా’ అంటారు. దీంతో బౌద్ధం తర్వాత రామాయణం వచ్చిందని వాదించే వాళ్ల గురించి చెబుతూ ఈ జాతీయం వచ్చిందని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>