News January 27, 2025

మేడ్చల్‌లో బోధన్‌కు చెందిన మహిళ హత్య

image

మేడ్చల్‌ మండలంలో ORR బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద ఈ నెల 24న జరిగిన <<15246720>>మహిళ <<>> హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు గురైన మహిళ బోధన్‌కు చెందిన వివాహితగా గుర్తించారు. భర్తకు దూరంగా కొంపల్లిలో మరో వ్యక్తితో ఆమె ఉంటున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే ఈ కేసులో ఆ వ్యక్తి కీలకంగా మారనున్నాడు. కాగా.. వివాహిత కుటుంబంతో పాటు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలను సేకరిస్తున్నారు.

Similar News

News December 24, 2025

పాలమూరు నీళ్ల రాజకీయం.. మళ్లీ మంటలు

image

ఒకప్పుడు కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న పాలమూరులో నీళ్ల రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. తెలంగాణ వస్తే జిల్లా పచ్చబడుతుందన్న హామీలతో ఉద్యమానికి ఊపునిచ్చిన KCR, పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ‘పాలమూరు బిడ్డ’గా చెప్పుకునే CM రేవంత్ సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. BRS ఆందోళనలకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ పనులతో సమాధానం చెబుతామంటోంది.

News December 24, 2025

HNK: విద్యార్థినులపై అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన?

image

హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఫిర్యాదు అందిందని ప్రిన్సిపల్ సంతోష్‌కుమార్ తెలిపారు. ‘విద్యార్థిని తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. 20వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని మెమో ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం’ అని ఆమె చెప్పారు.

News December 24, 2025

చిన్న సినిమాల హవా.. రేపు థియేటర్లలోకి మరిన్ని!

image

బాక్సాఫీసు వద్ద ఇటీవల పలు చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. రేపు నాలుగైదు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆది సాయి కుమార్ ‘శంబాల’, శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’, శివాజీ, నవదీప్ నటించిన ‘దండోరా’, హారర్ ఫిల్మ్ ‘ఈషా’, యూత్ ఫుల్ మూవీ ‘పతంగ్’ వంటివి ఈ లిస్టులో ఉన్నాయి. వీటితో పాటు ‘వృషభ’, ‘మార్క్’ లాంటి డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో మీరు దేనికి వెళ్తున్నారు?