News March 25, 2025

మేడ్చల్‌లో మున్సిపాలిటీలు.. ముందే చెప్పిన Way2News

image

మేడ్చల్‌లో మున్సిపల్ విస్తరణలో కీలక ముందడుగు పడింది. మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన 3 కొత్త మున్సిపాలిటీలు మూడుచింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట పరిపాలనా దృక్పథంలో కీలక మార్పునకు దారితీయనున్నాయి. అయితే, ఇదే విషయాన్ని Way2News ముందుగానే వెల్లడించింది. ‘మేడ్చల్‌ను పట్టణ జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధం’ అనే శీర్షికన ఈ నెల 13న వార్తను ప్రచురించింది. తాజా ప్రకటనతో మేడ్చల్ పూర్తిగా అర్బన్ కానుంది.

Similar News

News November 19, 2025

KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్‌ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

News November 19, 2025

ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

image

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్‌ పరీక్షల్లో బుక్‌లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్‌కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్‌లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్‌గా పరిగణిస్తారు.

News November 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 71

image

ఈరోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>