News March 26, 2025
మేడ్చల్‌లో రాజకీయ నిరుద్యోగం..!

అర్బన్ జిల్లాగా మేడ్చల్ అవతరించడంతో రాజకీయ నిరుద్యోగం పెరగనుందని నేతన్నల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పంచాయత్ రాజ్ వ్యవస్థ కనుమరుగై గ్రామాలన్నీ పట్టణాలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్, MPTC, MPP, ZPTC, ZP ఛైర్మన్ వంటి 700కుపైగా పదవులు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. రాజకీయంగా ఎదగాలనుకునే వారికి అవకాశం లేకుండా పోయింది. పట్టణీకరణతో తమ భవిష్యత్తుకే ఎసరు పెట్టారని పలువురు వాపోతున్నారు.
Similar News
News April 22, 2025
తప్పు చేసినవారిపై చర్యలు తప్పవు: సీఎం సిద్దరామయ్య

కర్ణాటకలో ‘వింగ్ కమాండర్‌పై దాడి’ కేసులో దోషులపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య స్పష్టం చేశారు. ‘కన్నడిగులు మాతృభాష పట్ల గర్విస్తారు. అలా అని ఇతర భాషల్ని ద్వేషించరు. దాడులు చేయరు. మాది అంతటి కుంచిత మనస్తత్వం కాదు. జాతీయ మీడియా మా గౌరవాన్ని దిగజార్చేలా వార్తలు వ్యాప్తి చేయడం దురదృష్టకరం. ఘటనపై సమగ్ర విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించాను’ అని తెలిపారు.
News April 22, 2025
సివిల్స్‌లో చెన్నూరు యువకుడికి 151వ ర్యాంకు

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(సివిల్స్) ఫలితాల్లో కడప జిల్లా యువకుడు సత్తా చాటాడు. చెన్నూరుకు చెందిన నేలటూరు శ్రీకాంత్ రెడ్డికి 151వ ర్యాంకు వచ్చింది. మొదటి, రెండో ప్రయత్నంలో ప్రిలిమినరీ, మెయిన్స్ పాసయ్యారు. ఇంటర్వ్యూ వరకు వెళ్లినా సెలెక్ట్ కాలేదు. తాజా ఫలితాల్లో సివిల్స్ సాధించారు. ఇండోర్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
News April 22, 2025
జీవీఎంసీ మాజీ మేయర్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు

జీవీఎంసీ మాజీ మేయర్ గోలగాని హరి వెంకటకుమారిని తొలగిస్తూ సంబంధించిన ఉత్తర్వులను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం జారీచేశారు. దీంతో మాజీ మేయర్ అన్ని రకాల అధికారాలు కోల్పోనున్నారు. మేయర్‌పై కూటమి అవిశ్వాసం నెగ్గడంతో త్వరలోనే కూటమి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.