News April 2, 2025
మేడ్చల్: అబ్రుక్ కాయితం ఆగవట్టలేమా?

అబ్రుక్ కాయితం వాడుడు జోరైతుంది. ప్లాస్టిక్ ముట్టంది దినం గడుస్తలేదు. మేడ్చల్ జిల్లా అంతా యాడ చూసినా ఇది అగుపిస్తుంది. పొద్దున పాల ప్యాకెట్ కెళ్లి షురూ జేస్తే సగులం ప్లాస్టిక్కే. అగ్గువకు దొరుకుడుతోని శితం వాడి, బయటేస్తున్నరు. ఏండ్ల కమానం భూమిల కల్శిపోక గుట్టలకు గుట్లు జమైతుంది. ప్లాస్టిక్ కడుపులకు జొర్రి అడ్డమైన క్యాన్సర్ బీమార్లు అంటుకుంటున్నయ్. సర్కార్ బంద్ వెట్టినా, నజరేయక అమలైతలేదు.
Similar News
News November 22, 2025
కృష్ణా: చోరీ అనుమానితుల ఫొటోలు విడుదల..!

మచిలీపట్నం మాచవరం సమీపంలోని పాత తౌడు ఫ్యాక్టరీ వద్ద రెండు రోజుల కిందట రెండు ఇళ్లలోకి చోరీకి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ 8332983789కు సమాచారం ఇవ్వాలని చిలకలపూడి సీఐ కోరారు. వీరిద్దరూ బైక్పై తిరుగుతుంటారని తెలిపారు.
News November 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.
News November 22, 2025
మెదక్: మరింత పైకి కూరగాయల ధరలు..!

కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తుఫాన్, అకాల వర్షాల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడం, కార్తీక్ మాసంలో కూరగాయల వినియోగం పెరగడం వంటి కారణాలతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో పాలకూర రూ.120, చిక్కుడు రూ.100, బీరకాయ రూ.100, బెండకాయ రూ.80, వంకాయ రూ.80 పలుకుతున్నాయి. మీ ప్రాంతంలో కూరగాయల ధరలు పెరిగాయా కామెంట్ చేయండి.


