News February 25, 2025

మేడ్చల్: ఇంటర్ ఎగ్జామ్స్ రాయనున్న 1.27లక్షల మంది విద్యార్థులు  

image

మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కో ఆర్డినేషన్ మీటింగ్ ను సోమవారం కలెక్టర్ ఛాంబర్లో అన్నిశాఖల అధికారులతో కలెక్టర్ గౌతం నిర్వహించారు. ఈనెల 5వ తేదీ నుంచి మార్చ్ 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని, ఈ పరీక్షలకు 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఫస్ట్ ఇయర్ 64,107మంది, సెకెండ్ ఇయర్ 62,316 విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.

Similar News

News October 20, 2025

టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత

image

AP ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, TDP ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బనాయుడు కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. నెల్లూరు(D) దగదర్తిలో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుబ్బనాయుడు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.

News October 20, 2025

CDACలో 646 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC)కు చెందిన వివిధ కేంద్రాల్లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cdac.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News October 20, 2025

అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: వరంగల్ కలెక్టర్

image

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.