News January 26, 2025

మేడ్చల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం 1.43 లక్షల దరఖాస్తులు

image

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని మొత్తం 1,43,267 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 1.మేడ్చల్ 2.మల్కాజిగిరి 3.కూకట్‌పల్లి 4.కుత్బుల్లాపూర్ 5. ఉప్పల్ నియోజకవర్గాలు కాగా..ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి దశలో కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశలో జిల్లాకు 17,500 ఇళ్లు రానున్నాయి.

Similar News

News October 30, 2025

జనగామ: రైతులకు అండగా ఉండండి: కలెక్టర్

image

వర్షాల నేపథ్యంలో రైతులకు అండగా ఉండాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

News October 30, 2025

నిర్మల్ పట్టణంలో ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం

image

నిర్మల్ పట్టణంలో గురువారం ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, నిర్మూలన మార్గాలకు సంబంధించిన విషయాలపై అవగాహన కలిగేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

News October 30, 2025

ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

image

ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.